Friday, May 3, 2024
- Advertisement -

రాబిన్ హుడ్ పాత్రలో రవితేజ!

- Advertisement -

రవితేజ మంచి జోరుతో వరసగా సినిమాలు తెస్తున్నారు. కిక్ 2 సినిమా ప్లాప్ అయిన ఆ తరువాత బెంగల్ టైగర్ తో మంచి హిట్ కొట్టాడు. రవితేజ త్వరలో రాబిన్ హుడ్ పాత్రలో కనిపించబోతున్నాడు. అవును చక్రి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయడానికి రవి ఓకే అన్నాడు. ఈ కొత్త సినిమాని రంజిత్ మూవీస్ సంస్థ నిర్మించబోతుంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి రాబిన్ హుడ్ అనే టైటిల్ ను ఖరారు చేసి టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేశారు అని సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పుడు రవితేజ, దిల్ రాజు ల మధ్య పోరు జరుగుతుందని సినీ పరిశ్రమలో గుస గుసలు వినబడుతున్నాయి. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రవితేజ ఎవడో ఒకడు అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాకి సంబంధించి పారితోషికం విషయం ఇద్దరి మధ్య పోరు జరుగుతుందట. అంతేకాక ఈ సినిమా స్టోరి విషయంలో సెకండ్ హాఫ్ అంతగా బాలేదని రవి భావిస్తున్నాడట. మరి ఈ సినిమా విషయంపై  దిల్ రాజు ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -