Sunday, May 19, 2024
- Advertisement -

రవితేజ అంత సాహసం చేశాడా?

- Advertisement -

ప్రయోగాలకు ఏ మాత్రం వెరవని టాలీవుడ్ హీరోల్లో మాస్ మహారాజ్ రవితేజ ఒకరు. అయితే.. తన దూకుడైన స్టయిల్ ఫాలో అవుతూనే.. కొత్త పాత్రల కోసం రవితేజ ప్రయత్నిస్తుంటాడు. అలాంటి ఈ హీరో.. ఇప్పుడు సిక్స్ ప్యాక్ ఫీట్ కూడా చేస్తున్నాడు. బెంగాల్ టైగర్ తర్వాత.. ఇప్పటి వరకు ఏ సినిమాను రిలీజ్ చేయని రవి.. తన కొత్త సినిమా కోసం జిమ్ లో విపరీతంగా కష్టపడుతున్నాడట.

ఓ కొత్త దర్శకుడి డైరెక్షన్ లో రానున్న ఈ సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ పూర్తయిందనీ.. రవి రెడీ అయితే.. షూటింగ్ కూడా పట్టాలెక్కడం ఖాయమనీ ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే సిక్స్ ప్యాక్ బాడీతో రవి రెడీ అవుతారనీ.. అప్పటికి అన్ని వివరాలు బయటికొస్తాయని తెలుస్తోంది.

దేశముదురులో అల్లు అర్జున్ తో మొదలైన సిక్స్ ప్యాక్ బాడీ ఫీట్ ను.. తర్వాత చాలా మంది హీరోలు ట్రై చేసి సక్సెస్ అయ్యారు. చివరికి వెటరన్ హీరో నాగార్జున కూడా సిక్స్ ప్యాక్ తో అదుర్స్ అనిపించాడు. ఇప్పుడు యూత్ కీ, వెటరన్ హీరోలకీ మధ్యలో ఉన్న రవితేజ కూడా.. సిక్స్ ప్యాక్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేయనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -