Friday, May 17, 2024
- Advertisement -

గట్టెక్కేదెలా?

- Advertisement -

ఓ వైపు పరిపాలన.. మరోవైపు భూ దందా ఆరోపణలు.. ఇంకో వైపు కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం దీక్ష హెచ్చరికలు. ఇలా ముప్పేట దాడి జరుగుతున్న ఈ పరిస్థితులను.. తట్టుకోవడమెలా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆలోచిస్తున్నారట. బయటికి మాత్రం.. అంతా సర్దుకుపోతాయన్నట్టు పని చేసుకుపోతున్న బాబు గారు.. పార్టీ ఆంతరంగిక సమావేశాల్లో మంత్రులు, తన సన్నిహితులతో ఇదే విషయం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

భూ దందా ఆరోపణలతో కీలక నేతల వ్యవహారాలపై జనంలో అనుమానాలు తలెత్తడంతో.. ఈ విషయాన్ని త్వరగా చల్లార్చే పనిపైనే బాబు కాన్సన్ ట్రేట్ చేస్తున్నారని సమాచారం. అది ఓ కొలిక్కి రాగానే.. వైసీపీ ఎమ్మెల్యేల్లో వీలైనంతమందిని సైకిల్ ఎక్కించేలా చేసి.. ఆ పార్టీని అదుపులో పెట్టాలని కూడా బాబుగారు చూస్తున్నారట. వీటి మధ్యలోనే తన సన్నిహితులు, కాపు వర్గానికి చెందిన ముఖ్య నేతలతో ముద్రగడ ఇష్యూకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారట.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా.. పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. గతంలో ఎన్నడూ ఎదుర్కోని రాజకీయ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే.. తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి మరీ.. ఈ గండాలను గట్టెక్కేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -