Sunday, April 28, 2024
- Advertisement -

బిగ్ బాస్ 7లో రవితేజ..!

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్‌గా పాన్ ఇండియా చిత్రంగా అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక రవితేజ కెరీర్‌లో ఇది తొలి పాన్‌ ఇండియా చిత్రం ఇది.

ఇక బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 5 వారాలు పూర్తి కావడానికి వచ్చింది. ఇక వీకెండ్, ఆదివారం కావడంతో ఇవాళ హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇక ఇవాళ బిగ్ బాస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పాల్గొననున్నారు రవితేజ.

రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హౌస్ మేట్స్‌తో అలరించనున్నాడు. ఆల్రెడీ షూట్ జరిగిన ఈ సాలిడ్ ఎపిసోడ్ తో టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ లో అలరించనున్నారు రవితేజ. ఈ సందర్భంగా ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. షూట్ గ్యాప్ లో అయితే నాగ్ కలిసి కూచ్చొని ముచ్చట పెట్టారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -