Saturday, May 4, 2024
- Advertisement -

జంటిల్ మెన్ ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి!

- Advertisement -

నాచురల్ స్టార్ నాని ఇప్పుడు సూపర్ జోరు మీదున్నాడు. అయితే అలాంటి నాని సినిమా జెంటిల్ మన్ బిజినెస్ ఇప్పుడు కొద్దిగా స్లోగా నడుస్తుందని తెలుస్తుంది. దానికి కారణం ఏమై ఉంటుందా అంటే జెంటిల్ మన్ సినిమా క్రూ అని తెలుస్తుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ.. దర్శకుడు ప్రతిభ కల వాడైనా సరే అల్లరి నరేష్ తో బందిపోటు అంటూ ఫ్లాప్ తో మరుగునపడ్డాడు.

అంతేకాదు పరిశ్రమ తన వంక చూసే హిట్ ఏది తన కెరియర్ లో సాధించలేదు. ఇక సినిమా సంగీత దర్శకుడు మణిశర్మ ఈ మధ్య బ్యాక్ అయ్యాడు. కుర్ర మ్యూజిక్ డైరక్టర్లు వచ్చేసరికి అర కొర సినిమాలతో కాలం వెళ్లదీస్తున్నాడు మణిశర్మ.  ఇక నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గురించి చెబితే అప్పట్లో బాలయ్యతో ఆదిత్య 369 సినిమా తీసినా కొన్ని సంవత్సరాల క్రితం మిత్రుడు అంటూ ఓ ఫ్లాప్ సినిమా తీశాడు. 

సో ఇన్ని ఫ్లాప్ కాంబినేషన్స్ లో నాని లాంటి హిట్ హీరో మరోసారి హిట్ సాధించగలుగుతాడా అన్నది ఇప్పడు అందరి డౌట్.. అంతేకాదు ఈ సినిమా బిజినెస్ అంత గొప్పగా ఏం జరగట్లేదు అన్నది తెలుస్తుంది. మరి కెరియర్ పీక్స్ లో ఉన్న నాని ఈ సినిమా చేయడం పట్ల ఎంతమంది వెనక్కి నెట్టే ప్రయత్న చేసినా తాను మాత్రం నమ్మకంగా చేశాడు. ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. సురభి, నివేధా థామస్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా జూన్ 17న రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -