Saturday, April 27, 2024
- Advertisement -

తెలుగుదేశం పార్టీలో చర్చలు!

- Advertisement -

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం తరఫున ప్రత్యేకంగా తాము చేస్తున్నది ఏమీ లేకపోయినా.. నిస్సిగ్గుగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తమకు కావాల్సిన దానిని పిండుకోవడానికి మాత్రం తెగిస్తుంది.. అనడానికి సురేష్‌ ప్రభు వ్యవహారమే ఉదాహరణ. విశాఖకు రైల్వేజోన్‌ గురించి వాళ్లు రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి మొత్తుకుంటూ ఉన్నప్పటికీ పట్టించుకోకుండా… తమ రైల్వే మంత్రినే ఏపీలో పాలకపక్షానికి ఉన్న బలం ఆధారంగా ఎంపీగా గెలిపించుకోవాలని భాజపా ఆశపడడం ఘోరం. ఈ విషయం మీదనే తెలుగుదేశం పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. భాజపా వైఖరిని పలువురు ఎండగడుతున్నారు. 

ప్రత్యేక హోదా విషయంలో మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర సర్కారు చేసిన వంచన ఒక ఎత్తు అయితే.. అదే మాదిరిగా రైల్వే జోన్‌ విషయంలో సురేష్‌ ప్రభు చేసిన వంచన కూడా చిన్నదేమీ కాదని తెదేపా నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. తమ ఎమ్మెల్యేలు సురేష్‌ప్రభుకు వేసే ఓటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ద్రోహం చేయడం వంటిదేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

వెంకయ్యనాయుడు జవాబుదారీతనం పెరుగుతుందనే భయంతోనే ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపీకాగల అవకాశాన్ని తాను వినియోగించుకోలేదని, అదే సమయంలో భాజపా మాత్రం నిస్సిగ్గుగా మరో కేంద్రమంత్రిని ఆ స్థానంలోకి బరిలోకి దింపి.. ఏపీ ద్వారా పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

తెలుగుదేశం పార్టీ విప్‌ జారీ చేయడం లేదా, మరో రకంగా తమ ఎమ్మెల్యేలను కట్టడి చేయడం జరగకపోతే గనుక.. తెదేపా ఓట్లు కొన్ని సురేష్‌ప్రభుకు మిస్సయ్యే ప్రమాదం కూడా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -