Friday, May 17, 2024
- Advertisement -

బిత్తిరి సత్తి.. సునీల్ చేసిన పనే చేస్తున్నాడా..?

- Advertisement -

బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తీన్మార్ వార్తల ద్వారా.. తన కామెడీ తో ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు సత్తి. యూట్యూబ్ లో కూడా సత్తి మంచి ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి వార్తను అయిన సత్తి తన స్టైల్ లో కామెడీతో చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. సత్తికి తోడుగా సావిత్రి వేసే పంచులు కూడా ఆ షోకి చాలా ప్లస్. ఎలాంటి అసభ్యతగల మాటలు లేకుండా పక్కా స్క్రిప్టు తో ఈ షో జరుగుతోంది.

ఈ షో మంచి సక్సెస్ సాధించడంతో.. ఆ ఛానెల్ కి మంచి రేటింగ్ వచ్చింది. దాంతో సత్తికి మంచి ఫాలోయింగ్ తో పాటు.. అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అయితే సత్తి తీన్మార్ వార్తలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సత్తి కామెడీకి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయట. సో తీన్మార్ వార్తలు చేయడానికి సత్తికి టైం కుదరకపోవడంతో ఆ షోకి గుడ్ బై చెప్పే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సత్తికి చాలా సినిమాలో కామెడీ రోల్స్ వస్తున్నాయట. ఇంత బిజీ షెడ్యుల్ లో బిత్తిరి సత్తి తీన్మార్ వార్తలకు సమయం కేటాయించలేక పోవడం కూడా అతను గుడ్ బై చెప్పడానికి కారణం కావచ్చు అంటున్నారు. అయితే గతంలో సునీల్ కూడా కమెడియన్ గా చేసి హీరో అయ్యాడు. కమెడియన్ అలానే కొనసాగి ఉంటే.. ఈ రోజు సునీల్ రెంజ్ మరోలా ఉండేది. సునీల్ హీరోగా చేసి.. రెండు హిట్స్ కొట్టడంతో.. అదే క్రమంలో సినిమాలు చేస్తూ.. కమెడియన్ పాత్రలకు చేయను అనేశాడు.

దాంతో సునీల్ హీరోగా స్టార్టింగ్ లో హిట్స్ కొట్టిన.. ఆ తర్వాత వరస ప్లాప్ లు ఎదురుకున్నాడు. ఇక తాజాగా వచ్చిన ఉంగరాల రాంబాబు సినిమా కూడా ప్లాప్ కావడంతో మళ్లీ కామెడీ పాత్రలు చేస్తా అని చెప్పుతున్నాడు. ఇదే క్రమంలో బిత్తిరి సత్తికి.. తీన్మార్ వార్తల ద్వారా మంచి పేరు వచ్చింది. సినిమాలు ఎన్ని వచ్చిన.. అవి అతనికి పేరు తెచ్చిపెట్టి వరస అవకాశాలు తెచ్చిపెడుతోందని చెప్పలేం కాబట్టి.. సునీల్ చేసిన తప్పే సత్తి చేయకుండా.. తీన్మార్ వార్తల్లో చేయడం వల్ల అతని ఫాలోయింగ్ మరింత పేరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -