Wednesday, May 1, 2024
- Advertisement -

సలార్ రన్‌టైం లాక్!

- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సలార్. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి పార్టు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక సలార్‌కు పోటీగా షారుఖ్ డంకీ వస్తుండగా ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇద్దరు స్నేహితులు బద్ద శత్రువులుగా మారి చేసే యుద్ధమే సలార్ అని…ఫస్ట్ పార్టు మొత్తం వీరిద్దరి స్నేహం, ఫైట్ మొదలు వరకు ఉండనుందని టాక్. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన గౌడ ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా రన్‌ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ సెన్సార్ పూర్తి కాగా దీనికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారని సమాచారం. రన్ టైం 2 గం. 55 నిమిషాలు ఉండనుందట. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -