Tuesday, May 7, 2024
- Advertisement -

తెలుగు సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సల్మాన్ ఖాన్..!

- Advertisement -

త్వరలోనే ‘కిక్’ సినిమాకు సీక్వెల్ ను రూపొందించబోతున్నాడట బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. తనే హీరోగా రూపొంది హిందీలో సూపర్ హిట్ అయిన సినిమాకు సీక్వెల్ ను చేయించే పనిలో ఆయన బిజీగా ఉన్నాడట.

కిక్ సినిమా మొదటి పార్ట్ ను రూపొందించిన సాజిద్ నడియావాలానే పార్ట్ టూ నుకూడా రూపొందించనున్నాడట. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

తెలుగులో రవితేజ, ఇలియానాలు జంటగా నటించిన ‘కిక్’ సినిమానే సల్లూ రీమేక్ చేశాడు. తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా హిట్ అయిన చాలా సంవత్సరాలకు సల్మాన్ దాన్ని హిందీలో తీశాడు. క్రిటిక్స్ నుంచి విమర్శలు వచ్చినప్పటికీ గత ఏడాదిలో వచ్చిన కిక్ సినిమా వసూళ్ల పంటను పండించింది. దీంతో ఇప్పుడు దానికి సీక్వెల్ ను రూపొందించడానికి హిందీ దర్శక, హీరోలు ఉత్సాహంగా ఉన్నారు.

మరి తెలుగు నుంచి హింందీలో రీమేక్ చేసిన సినిమాకు ఇలా సీక్వెల్ రూపొందుతూ ఉండటం విశేషమే. ఇది వరకూ సౌత్ లో హిట్ అయిన ‘సింగం’ సినిమాను హిందీలో రీమేక్ చేసి.. దానికి హిందీ వారే సీక్వెల్ కూడా తీసుకొన్నారు. ఇప్పుడు ‘కిక్’ విషయంలోనూ అదే జరుగుతోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -