Sunday, May 19, 2024
- Advertisement -

‘బంగారు బాబు ‘తో సమంత ఫుల్ హ్యాపీస్

- Advertisement -

ఆ మధ్య కాలం లో సరైన హిట్ లేక తమిళం లో డీలా పడిపోయింది సమంత, ఈ మధ్య కాలం లో ట్రాక్ చాలా స్పీడ్ గా పుంజుకుంది ,తమిళం లో కత్తి సినిమా తరవాతా – కత్తి సినిమాకి ముందూ అంటూ సమంత కెరీర్ ని బేరీజు వెయ్యచ్చు కూడా.

ఆమె ప్రస్తుతం విడుదల కి లిస్టు లో పెట్టిన సినిమాలు చూస్తే వామ్మో అంటారు జనాలు. 

మొదటగా ఈనెల 21 రిలీజ్ కాబోతోంది 10 ఎన్రాదుకుళ్ల. విక్రంతో కలిసి శామ్ చేసిన ఈ జర్నీ బేస్డ్ మూవీపై చాలా అంచనాలున్నాయి.

ఐ ఫ్లాప్ తర్వాత విక్రం చేస్తున్న మూవీ ఇది. దీని తర్వాత ధనుష్ సమంత కలిసి నటించిన మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటివరకూ వేల ఇల్లై పట్టాదారి కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని భావించారు. అదేనండీ.. తెలుగులో రఘువరన్ బీటెక్ అంటూ వచ్చి.. పబ్లిసిటీ లేకుండానే ఇరగదీసేసిన మూవీ వేల ఇల్లై పట్టాదారి. ఆ మూవీని తీసిన డైరెక్టర్ వేల్ రాజ్ తో వెంటనే మరో మూవీ చేయడంతో.. ఇది దానికి సీక్వెల్ గా భావించారు. కానీ.. ఇప్పుడీ సినిమాకి ఓ టైటిల్ ఇచ్చేశారు. తంగ మగన్ అనే టైటిల్ ని ప్రకటించారు.ఈ  తంగ మగన్ అంటే అర్ధం ” బంగారు బాబు” అని.

 ఈ తంగ మగన్ 1983 లో రజినీకాంత్ చెయ్యగా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు రజినీ అల్లుడు కూడా అదే పేరు పెట్టడం తో హైప్ అమాంతం పెరిగిపోయింది. దీపావళి కి విడుదల ఉంటుంది. ఇలా తాను అంచనాలు పెట్టుకున్న సినిమాలు అన్నీ వరస పెట్టి రావడం తో సమంత ఫుల్ ఖుషీ గా ఉంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -