Monday, May 6, 2024
- Advertisement -

నా అన్నయ్య గురించి ఎవడేమి వాగినా నేను పట్టించుకోను – ఎన్టీఆర్

- Advertisement -

కళ్యాణ్ రాం – ఎన్టీఆర్ నందమూరి అన్నదమ్ములు. ఈ సంవత్సరం పటాస్ అంటూ సూపర్ హిట్ తో తానూ పెద్ద హీరోల రేస్ లో ఉన్నాను అని నిరూపించుకున్న కళ్యాణ్ రాం ఇప్పుడు షేర్ గా త్వరలో థియేటర్ లలోకి రాబోతున్నాడు.

ఈ సినిమా ఆడియో వేడుక కి విచ్చేసిన ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆడియో వేడుక సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ” కళ్యాణ్ రాం చెప్పిన ప్రతీ మాటలోనూ నేనూ వెంట ఉన్నాను, ఆయన మాట్లాడినా మాటలు అన్నీ నా మాటలు గా నేను స్వీకరిస్తున్నాను, కళ్యాణ్ రాం లాంటి ఉన్నతమైన వ్యక్తికి తమ్ముడుగా నేను గర్వపడుతున్నాను ” అన్నారు ఎన్టీఆర్ . 

అప్పట్లో కిక్ 2 సినిమా విడుదల ఆలస్యం అవడం తో మీడియా ఇష్టం వచ్చినట్టు రాసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కిక్ 2 సినిమా విషయం లో ఇన్వాల్వ్ అయ్యి దిల్ రాజు ని రంగం లోకి దింపి తాను సొంతగా డబ్బు పెట్టుకుని మరీ ఆ చిత్రాన్ని విడుదల చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అని కళ్యాణ్ రాం ఆర్ధికంగా చాలా ఇబ్బందులకి గురయ్యాడు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదు అని ఎన్టీఆర్ స్టేజీ మీద తెలిపారు “అప్పట్లో నేనేదో అభి రాం పుట్టిన రోజు కోసం అంటూ వస్తే మీడియా ఇష్టం వచ్చినట్టు రాసేసింది, కిక్ 2 సినిమా విడుదల కోసం నేను ఎలాంటి సంతకాలూ పెట్టనే లేదు. 

కళ్యాణ్ రాం చెయ్యి చనిపోయే ముందు దాకా ఇలాగే ఉంటుంది  (చెయ్యి కిందకి చూపిస్తూ) తప్ప , ఇలా ఉండదు (చెయ్యి పైకి చూపిస్తూ) అన్నారు ఎన్టీఆర్. దీంతో కిక్ 2 సినిమా ఎన్ని నష్టాలు తెచ్చినా కళ్యాణ్ రాం ఆర్ధికంగా ఏమీ కుంగిపోలేదు అన్న విషయం తేలిపోయింది . ఇష్టం వచ్చినట్టు కూసే కారు కూతల పరంపర లో మా అన్నయ్య గురించి ఎవడేమి వాగినా నేను పట్టించుకోను అని కుండ బద్దలు కొట్టారు ఎన్టీఆర్ .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -