అక్కినేని నాగ చైతన్య, సమంతల పెళ్లి గోవాలోని ఒక రిసార్ట్ లో శుక్రవారం రాత్రి గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. హిందూ సంప్రదాయ ప్రకారం చైతూ, సమంత ఒక్కటి అయ్యారు. ఇక శనివారం క్రిష్టియన్ సంప్రదాయంలో మరోసారి ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక అధికారికంగా సమంత అక్కినేని వారి ఇంటి కోడలు అయిపోయింది.
ఈ పెళ్లికి కేవలం ఇరుకుటుంబాల వారు మాత్రమే హాజరవడంతో సినీ పరిశ్రమలోని నటీనటులెవరికి ఈ పెళ్ళికి ఆహ్వానం అందలేదు. అయితే వాళ్ల విషయం పక్కన పెడితే.. ఈ పెళ్లికి చైతన్యను కన్న తల్లి నాగార్జున మొదటి భార్య లక్ష్మీ వచ్చిందా లేదా అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడి కూతురు, హీరో వెంకటేష్, నిర్మాత సురేష్‌బాబుల చెల్లెలు అయిన లక్ష్మీని నాగార్జున వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి నాగచైతన్య పుట్టిన తర్వాత వారిద్దరూ విడిపోయారు.
అయితే చాలా కాలం తర్వాత చైతన్య ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన లక్ష్మీ.. కొడుకు పెళ్లికి వచ్చిందా.. రాలేదా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ పెళ్లి కి సంబంధించిన ఫోటోలు బయటకు చాలానె వచ్చాయి. వాటిలో లక్ష్మీ ఎక్కడ కూడా కనిపించకపోవడంతో.. ఆమె వచ్చిందా రాలేదా అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.