Saturday, April 27, 2024
- Advertisement -

కొత్త అవతారమెత్తిన సమంత!

- Advertisement -

గాడ్‌ఫాదర్‌ లేకుండా ఓ హీరోయిన్ ఇండస్ట్రీలో ఎదగడం మాములు విషయం కాదు. అలాంటిది ఏకంగా దశాబ్ద కాలం పాటు వెండితెరపై తనదైనశైలీలో నటించి మెప్పించిన హీరోయిన్ సమంత. అగ్రహీరోలందరితో కలిసి నటించిన ఈ బ్యూటీ అనారోగ్య కారణలతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఖుషి హిట్ తర్వాత తన ఆరోగ్యంపై దృష్టి సారించిన ఈ బ్యూటీ మళ్లీ సినిమాల్లో రాణించేందుకు సిద్ధమవుతోంది. ఓ వైపు సినిమాలు,ఓటీటీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరోవైపు నిర్మాతగా మారారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరిట కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించినట్లు తెలిపింది సమంత.

వాస్తవికతతో కూడిన అర్థవంతమైన కథలు చెప్పగలిగే ప్రతిభావంతులైన కొత్త దర్శకులను తన నిర్మాణ సంస్థ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని తెలిపింది సమంత. ప్రస్తుతం ఓ అమెరికన్ రీమేక్ సిరీస్ లో నటిస్తోంది సామ్. ఇప్పటివరకు హీరోయిన్‌గా సత్తా చాటిన ఈ బ్యూటీ ఇకపై నిర్మాతగా ఏ మేరకు రాణిస్తుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -