Monday, May 6, 2024
- Advertisement -

వైఎస్‌ఆర్‌ లా నేస్తం..అప్లై చేసుకోండిలా!

- Advertisement -

అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న జగన్ అనేక పథకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యువలాయర్ల కోసం తీసుకొచ్చిన పథకం వైఎస్‌ఆర్ లా నేస్తం. దీని ద్వారా కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి లాయర్ వృత్తిలో నిలదొక్కుకునేలా 3 సంవత్సరాల పాటు ఒక్కొక్క ఏడాదికి రూ. 60 వేలు రెండు దఫాల్లో చెల్లించనున్నారు. మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 స్టైఫండ్ అందించనుండగా నెలకు 5 వేలు చొప్పున జులై నుంచి డిసెంబర్ వరకు 6 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.30వేల సాయాన్ని అందించనున్నారు.

ఇవాళ తాడేపల్లి నుండి వైఎస్‌ఆర్ లా నేస్తం నిధులను విడుదల చేయనున్నారు సీఎం జగన్. 2,807 మంది యువ న్యాయవాదులకు రూ.7 కోట్ల 98 లక్షలను వారి ఖాతల్లో జమ చేయనున్నారు. ఇవాళ అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ. 49.51 కోట్లు.

()దరఖాస్తుదారు న్యాయశాస్త్రంలో పట్టా పొంది ఉండటంతో పాటుగా ఏపీ న్యాయవాదుల మండలిలో పేరు నమోదు చేసుకొని ఉండాలి.

()జీవో జారీ చేసే నాటికి న్యాయవాదికి 35 ఏళ్ల వయస్సు మించకూడదు.

()లాయర్‌గా పేరు నమోదు చేసుకున్న ఎన్‌రోల్‌మెంట్ ధ్రువపత్రాన్ని పరిగణలోకి తీసుకొని మొదటి మూడేళ్లను లెక్కిస్తారు.

()జీవో జారీ చేసే నాటికి జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించి మూడేళ్లు నిండనివారు మిగిలిన కాలానికి మాత్రమే స్టైఫండ్ పొందుతారు.

()ఒక కుటుంబంలో ఒకరికే ఈ బెనిఫిట్ ఉంటుంది. భర్త, భార్య, పిల్లలు.. ఇలా ఓ కుటుంబంలో ఇద్దరు అంతకంటే ఎక్కువ ఉంటే ఒకరికే ప్రయోజనం వర్తిస్తుంది.

()నాన్ ప్రాక్టీస్ లాయర్లు, మూడేళ్ల ప్రాక్టీస్ పూర్తి చేసినవారు, ఫోర్ వీలర్ కలిగిన వారు, న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకొని, న్యాయవాదిగా, ప్రాక్టీస్ చేయకుండా ఇతర ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వారు కూడా అనర్హులు.

()ఆర్థిక సాయం కోరే అడ్వకేట్స్ ఆన్ లైన్‌లో mailto:[email protected] ద్వారా లేదా నేరుగా లా సెక్రటరీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఆధార్ నెంబర్ జత చేయాల్సి ఉంటుంది.

()స్టైఫండ్ ఏ బ్యాంకు ఖాతాలో కావాలో ఆ అకౌంట్ నెంబర్ వివరాలు ఇవ్వాలి.. వీటిని గ్రామ/వార్డు వాలంటీర్లకు పంపిస్తారు. దరఖాస్తు సరైనదేనని తేలితో దానిని పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు.. జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు. కలెక్టర్ల ఆమోదం పొందిన అనంతరం ఆ దరఖాస్తును మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు CFMSలో అప్ లోడ్ చేస్తారు.

()వైఎస్సార్ లా నేస్తం పథకానికి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులున్నా 1902 ను సంప్రదించవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -