Wednesday, May 29, 2024
- Advertisement -

సంపూ మంచిగా బుద్ది చెప్పాడు

- Advertisement -

బాలీవుడ్‌కి చెందిన కమాల్ రషీద్ ఖాన్ పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.  ఇలా కామెంట్స్ చేసినందుకు అతడిపై పవన్ అభిమానులు ఓ రెంజ్‍లో విరుచుకు పడ్డారు. తాజాగా టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా  కమాల్ రషీద్ కి తగిన సమాధానం ఇచ్చాడు.

సంపూర్ణేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అవును.. “ఆయన కార్టూనే. బ్యాట్ మెన్ టైపు. నైస్ టు మీట్ యు స్నూపీ’’ ట్విట్ చేశారు. సాధారణంగా కుక్కలను మనం స్నూపీ అనే పేరుతో పిలుస్తుంటాం. కమాల్ రషీద్ ఖాన్‌ను కుక్కను పిలిచినట్లు ఆ పేరుతో సంపూర్ణేష్ బాబు పిలవడం ద్వారా తగిన బుద్ది చెప్పారని అంటున్నారు ఫ్యాన్స్.

ఇక ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం.ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్‌, గుడ్‌ సినిమా గ్రూప్‌, సంజన మూవీస్‌ పతాకంపై ఆది కుంభగిరి, సాయి రాజేష్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -