Tuesday, May 14, 2024
- Advertisement -

సంక్రాంతి సినిమాలు పండగ చేసుకుంటున్నాయి

- Advertisement -

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సందడి మామూలుగా లేదు. ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’, బాలకృష్ణ ‘డిక్టేటర్’, శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఇలా ఏకంగా నాలుగు సినిమాలు విడుదలై అన్నీ బాక్సాఫీస్ వద్ద టార్గెట్ ఆడియన్స్‌ను మెప్పిస్తూ దూసుకుపోతున్నాయి.

ఈ సినిమాలకే థియేటర్ లు మొత్తం ఫుల్ అవ్వడం తో ఈ వారం ఏ ఒక్క సినిమా నిర్మాతా కూడా విడుదల కి సాహసం చెయ్యలేదు. సాధారణంగా రెండు వారాల పాటు గ్యాప్ ఏ సినిమాకీ దొరకదు కానీ ఈ సినిమాలకి మాత్రం ఫుల్లుగా దొరకగా. సోగ్గాడే .. , ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలకి అధిక థియేటర్ లు దొరికాయి.

సీమలో తప్ప డిక్టేటర్ పెద్దగా ఎక్కడా ఆడడం లేదు కూడా. ఇతర సినిమాలేవీ లేకపోవడంతో సంక్రాంతి సినిమాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. శని, ఆదివారాలతో పాటు జనవరి 26న రిపబ్లిక్ హాలీడేలతో కలుపుకొని రెండో వారం సంక్రాంతి సినిమాలన్నీ మంచి కలెక్షన్స్ సాధించే సూచనలు కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -