Saturday, May 18, 2024
- Advertisement -

బన్నీ కూడా టీజర్ పట్టుకొస్తున్నాడు!

- Advertisement -

అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్‍లో వస్తున్న సినిమా సరైనోడు. ఈ సమ్మర్‍లో ఏప్రిల్ 28న ఈ సినిమాని విడుదలకు ప్లాన్ చేశారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్‍తో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు దర్శకుడు బోయపాటి. అల్లు అర్జునే కాక, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇలా టాప్ హీరోలందరు ఇప్పుడు సమ్మర్‍ నూ టార్గెట్ చేసుకొని తమ సినిమాలను విడుదల చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితమే అల్లు అర్జున్ సరైనోడు సినిమా ఫస్ట్ లుక్‍ని విడుదల చేశారు. ఈ లుక్ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు దర్శకుడు టీజర్‍ రిలీజ్‍కు రెడీ చేస్తున్నారు. ఈ నెల 18న ఈ సినిమా సంబంధించిన టిజర్ రిలీజ్ చేయనున్నారు.

ఈ వార్త బన్నీ అభిమానులకు ఓ శుభవార్తే. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మార్చిలో ఈ సినిమా పాటలను విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్, కేథరిన్‍లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అదిపినిశెట్టి విలన్‍గా నటిస్తున్నాడు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -