Tuesday, May 21, 2024
- Advertisement -

సర్దార్ షూటింగ్ ఎంత వరకు వచ్చిందో తెలియాలి అంటే ఇది చదవండి!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఐతే ఈ సినిమా రిలీజ్ కు ఇంక పదే పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇవాల్టి రోజు మినహాయిస్తే మిగిలింది వారం మీద మరో మూడు రోజులే.

మరింత స్వల్ప వ్యవధిలో ఒక సినిమా విడుదల అవుతుంటే సాధారణంగా ఏం చేస్తుంటారు? నిర్మాణ అనంతర కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటారు. విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. మరి.. సర్దార్ గబ్బర్ సింగ్ ఏం చేస్తున్నాడు? అంటే.. షూటింగ్ చేసుకుంటున్నాడని చెప్పాలి. నమ్మశక్యంగా అనిపించకున్నా ఇది నిజం. రామోజీ ఫిలింసిటీకి దగ్గరల్లో రోడ్ల మీద.. గబ్బర్ సింగ్ లోని రౌడీ బ్యాచ్ తో సీన్లను తాజాగా తీస్తున్నారు.

విడుదలకు డేట్ దగ్గరకు వస్తున్నా.. ఇంకా సినిమా షూట్ పూర్తి కాకుంటే.. మిగిలిన పనులు పూర్తి అయ్యేదెప్పుడు? అన్న డౌట్ రాక మానదు. అయితే.. తాజాగా జరుగుతున్న షూటింగ్ పార్ట్ మొత్తం ప్యాచప్ మాత్రమేనని.. పవన్ నటించాల్సిన పార్ట్ పూర్తి అయ్యిందని చెబుతున్నారు. సో మరి హడవుడిగా షూట్ చేస్తున్న ఈ సినిమా అవుట్ పూట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -