Friday, May 17, 2024
- Advertisement -

‘సరైనోడు’ బ్లాక్ బస్టర్ పుల్ సాంగ్

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా… సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో… సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో… విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరైనోడు’.

తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా… అల్లు అర్జున్, అంజలిపై చిత్రీకరించిన ‘బ్లాక్ బస్టర్’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ సినిమాలో హైలెట్ అవుతుందని, మాస్ ప్రేక్షకులను అలరిస్తుందని స్పష్టమవుతోంది. ఈ ప్రత్యేక గీతంలో అంజలి హాట్ లుక్ ఆకట్టుకోబోతోంది.

ఐతే ఈ పాట సంబంధించి ఇప్పుడు మొత్తం సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్లు ఊపందుకోబోతున్నాయి. ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

{youtube}MD_BI8hHyWc{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -