Wednesday, May 15, 2024
- Advertisement -

సర్దార్ సినిమాలోని ఫోటో హల్ చల్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అందల భామ కాజల్ హీరోయిన్‍గా తెరకెక్కుతున్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు తుది మెరుగులకు సిద్ధమవుతోంది. వచ్చే నేలలో రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు. సో టైమ్ ఎక్కువ లేకపోవడంతో అన్ని పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

ఐతే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క లీక్ కూడా కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది చిత్ర యూనిట్. కానీ ఇప్పుడు ఈ సినిమా సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల చేస్తుంది. ఈ ఫోటో ఎడిటింగ్ జరుగుతున్న సమయంలో తీసినదే అనే విషయం అర్ధమవుతోంది. ఇలాగే ఎడిటింగ్ జరుగుతున్న సమయంలో అత్తారింటికి దారేది మూవీ మొత్తం లీక్ అయిపోయింది.

ఇప్పుడు సర్దార్ కి కూడా సరిగ్గా ఎడిటింగ్ జరుగుతున్నప్పుడే ఫోటో బయటకు రావడంతో.. పవన్ ఫ్యాన్స్ లో ఏదో జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ మరో ఫోటో కూడా లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -