Saturday, May 11, 2024
- Advertisement -

సరైనోడు సెన్సార్ టాక్!

- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రకుల్, క్యాథరిన్ లు హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న చిత్రం సరైనోడు. ఈ సినిమా పై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’ వంటి హిట్ చిత్రాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘సరైనోడు’.

టైటిల్ కు తగ్గట్లుగానే ఇందులో అల్లు అర్జున్ పర్ఫెక్ట్ బాడీతో, స్టైలిష్ మాస్ లుక్ లో అదరగొడుతున్నాడు. ‘సింహా’, ‘లెజెండ్’, వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ ‘సరైనోడు’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన పాటలు, వీడియోలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇందులోని బ్లాక్ బస్టర్ సాంగ్ చాట్ బస్టర్స్ లో టాప్ 10 స్థానంలో నిలిచింది. అయితే తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ‘సరైనోడు’కు U/A సర్టిఫికెట్ ను అందజేసారు. అలాగే సెన్సార్ బోర్డ్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది.ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, మలయాళం భాషలలో గ్రాండ్ ఏప్రిల్ 22న విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను కొల్లగొట్టి, ఎంత కలెక్షన్లు రాబట్టనుందో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -