Thursday, May 16, 2024
- Advertisement -

మరోసారి రికార్డుల తుప్పు వదలగొట్టనున్నాడు!

- Advertisement -

బాహుబలి సినిమాతో తెలుగు లోనే కాకుండా అన్ని భాషల్లో మంచి విజయంతో పాటు కలక్షన్స్ కూడా రాబట్టింది. ఇటివలే ఈ సినిమాకి జాతీయ అవార్డ్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఒక తెలుగు సినిమాకి జాతీయ అవార్డ్ రావాడం చాలా గ్రేట్. బాహుబలి మొదటి భాగం అద్భుతంగా హిట్ అవ్వడంతో ఇప్పుడు బాహుబలి 2 మరింత అంచనాలు పెరిగిపోయాయి.

ప్రపంచ మొత్తం ఇప్పుడు బాహుబలి 2 కోసం ఎదురు చూస్తున్నారు. అయితే బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమౌళి బాహుబలి 2 తో మరోసారి రికార్డుల తుప్పు వదలగొట్టనున్నాడు. బాహుబలి 2 ఎనలేని క్రేజ్ రావడంతో ఈ చిత్ర హిందీ హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

దాంతో బాలీవుడ్ లో పేరు గాంచిన యష్ రాజ్ ఫిలిమ్స్ ఏకంగా ఈ చిత్రానికి 150 కోట్లు ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే బాహుబలి 2 రిలీజ్ అవ్వకముందే మరిన్ని సంచలనాలను నమోదు చేయడం ఖాయం. ప్రభాస్ ,రానా , అనుష్క , రమ్యకృష్ణ , తమన్నా లు నటిస్తున్న బాహుబలి 2 చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -