Saturday, May 18, 2024
- Advertisement -

రాజ్ తరుణ్‍కి దెబ్బ పడింది!

- Advertisement -

కొత్త కథలతో చిన్న సినిమాలుగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ సాదిస్తు ఉంటాయి రాజ్ తరుణ్ సినిమాలు. వరసగా మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో మనోడి రెంజ్ పెరిగిపోయింది. సుకుమార్ నిర్మాణంలో వచ్చిన కూమారి 21ఎఫ్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో రాజ్‍కు వరస అవకాశాలు వచ్చాయి.

నిన్న రిలీజ్ అయిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాతో రాజ్ తరుణ్ హిట్ పార్ములకు బ్రేక్ పడింది. ఈ సినిమాతో నాలుగో హిట్ సొంతం చేసుకుందాం అనుకున్న ఈ సినిమాపై ఇప్పుడు నెగిటివ్ టాక్ నడుస్తుంది. సినిమాలో పెద్దగా కొత్తదనం లేకపోవడం రొటిన్ కథనం, కామీడి కూడా అంతగా లేకపోవడంతో సినిమాపై బిలో యావరేజ్ టాక్ నడుస్తోంది.

వరసగా మూడు సినిమాలు హిట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఉండటం వల్ల తొలి రోజు కలెక్షన్స్ మాత్రం ఈ మూవీకి బాగానే వచ్చాయి.  కొన్ని సినిమాలుకు మొదట నెగిటివ్ టాక్ వచ్చిన ఒక్కోసారి ఊహించని విధంగా వసూళ్లు వస్తుంటాయి.శని – ఆదివారాలో కూడా ఈ సినిమాకి మంచి కలక్షన్లు రావోచ్చు. ఇంకో నాలుగు రోజులు ఈ సినిమా నిలబడితే మూవీ హీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ సినిమా హిట్ అయ్యే సూచనాలు అయితే కనిపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -