Tuesday, May 21, 2024
- Advertisement -

రాజమౌళి శిష్యులకే ఎందుకు ఇలా?

- Advertisement -

టాలీవుడులో ప్లాప్ అన్న విషయమే ఎరగని దర్శకుడు రాజమౌళి. అతని ప్రతి సినిమాని చాలా జాగ్రత్తగా తెరకేక్కించి హిట్ కొడుతుంటాడు ఈ దర్శకుడు. ఐతే రాజమౌళి దగ్గర పని చేసే అతని శిష్యులు కూడా అదే రెంజ్‍లో సినిమాలు తెరకేకించడలో దెబ్బ తింటున్నారు. రాజమౌళి దగ్గర నుంచి వచ్చిన అతని శిష్యులందరు విఫలమవుతున్నారు.

నితిన్‍ హీరోగా ‘ద్రోణ’ అనే సినిమాని రాజమౌళి శిష్యుడు కరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఇక మరో శిష్యుడు మహదేవ్‌ బాలయ్యతో ‘మిత్రుడు’ అనే సినిమాని తీసాడు ఈ సినిమా ఫలితమేంటన్నది తెలిసిందే. ఇక తాజాగా నిన్న రిలీజ్ అయిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ మూవీతో జగదీష్‌ తలసిల దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ దర్శకుడు జక్కన్నకు ప్రియ శిష్యుడు ఎందుకు అంటే ఈ సినిమా ఆడియో వేడుకలో జగదీష్ గురించి చాలా విషయలే చెప్పాడు రాజమౌళి.

జగదీష్ ఈ సినిమాతో మంచి దర్శకుడు అవుతాడు అని ఈ ఆడియో వేడుకలో చెపాడు కానీ జక్కన్న ఇంతగా చేప్పిన దర్శకుడిగా మెప్పించలేకపోయాడు.  ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ ప్రస్తుతం నెగిటివ్ టాక్ వినిపిస్తుంది. కథ కొత్తగా ఉన్న కథనం విషయంలో ఈ దర్శకుడు మెప్పించలేకపోవడం వల్ల ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దర్శక ధీరుడు రాజమౌళి దగ్గర నుంచి వచ్చిన ప్రతి దర్శకుడు ఇలా ఫేల్ అవుతునే ఉన్నారు. మరి రాజమౌళి దగ్గర ఏం నేర్చుకుంటున్నారో వీరికే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -