తనపై ఎలాంటి కేసులు లేవని సర్టిఫికెట్ ఇస్తేనే షూటింగ్ చేసుకునే ఛాన్స్! వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం! కాకపోతే మనదేశంలో కాదులెండి! సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న సినిమా 2ఓ. శంకర్ దర్శ్సకత్వంలో, లైకా సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా లో ఎమీ జాక్సన్ హీరోయిన్!
తాజాగా ఈ సినిమాలో విలన్ రోల్ తో అక్షయ్ కుమార్ జాయిన్ అయ్యాడు. ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ బొలియా దేశంలో జరపాలని యూనిట్ భావించిందట. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య. ఈ దేశంలో షూటింగ్ చేయాలన్నా, వృత్తిరీత్యా ఆ దేశానికి వెళ్లాలన్నా.. సదరు వ్యక్తిపై ఎలాంటి నేరారోపణలు, కేసులూ ఉండకూడదు.
అలాగని తన దేశ పోలీసులతో సర్టిఫికెట్ పొంది, ఆ దేశ అధికారులకు అందించాలి. దీంతో సూపర్ స్టార్ రజనీ, చెన్నై నగర పోలీస్ కమిషనర్ ను కలిసి.. తనపై ఎలాంటి కేసులు లేవని సర్టిఫికెట్ ఇవ్వాలని వినతిపత్రం అందించారు! ఈమేరకు రజనీకి పోలీసులు సర్టిఫికెట్ అందిస్తేనే.. బొలిలియా దేశం వెళ్లి సినిమా షూటింగ్ చేసుకోవచ్చు!