Thursday, May 9, 2024
- Advertisement -

శర్వానంద్ అర్జున్ రెడ్డి ఎందుకు చేయలేదో తెలుసా..?

- Advertisement -

టాలీవుడ్ తాజాగా ‘అర్జున్ రెడ్డి’ వచ్చి ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా విజయదేవరకొండ చేయడానికి ముందు ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి.. అర్జున్ రెడ్డి కథను యంగ్ హీరో శర్వానంద్ వినిపించాడట. కానీ కొన్ని కారణల వల్ల సందీప్ రెడ్డి ఈ సినిమాని శర్వాతో చేయలేకపోయాడు.

కానీ ఆ కారణాలు ఏంటో సందీప్ చెప్పలేదు. తాజాగా శర్వానంద్ ఆ కారణాలు ఏంటొ తెలిపాడు. తాను పెట్టిన ఒక కండిషన్ వల్ల సందీప్ తో అర్జున్ రెడ్డి సినిమా చేయలేకపోయానని శర్వానంద్ తెలిపాడు. తనకు అర్జున్ రెడ్డి కథ బాగా నచ్చిందని.. దీని మీద ఒక వర్క్ కూడా చేసి.. ఆ తర్వాత షూటింగుకి వెళ్లాలని కూడా అనుకున్నట్లు శర్వానంద్ తెలిపాడు. అయితే అర్జున్ రెడ్డి మూవీని సందీప్ స్వీయ నిర్మాణంలో చేయాలనుకున్నాడని.. ఆ విషయంలోనే తాను అభ్యంతర పెట్టానని శర్వా తెలిపాడు. అశ్వినీదత్‌తో పాటు మరో నిర్మాతను కూడా తాను కలిసే ఏర్పాటు చేశానని.. అది వర్కవుట్ కాలేదని.. సందీప్ తనే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాననడంతో తాను సినిమా చేయలేదని శర్వా అన్నాడు.

డైరెక్టరే.. ప్రోడ్యూసర్ అవుతే చాలా ఇబ్బందులుంటాయని.. ప్రోడక్షన్ మీద దృష్టిపెడితే సినిమా సరిగా రాదని.. గతంలో ఈ విషయంలో తనకు కొన్ని చేదు అనుభవాలుండటంతోనే వేరే నిర్మాత ఉండాలని శర్వానంద్ పట్టు బట్టాడట. కానీ అర్జున్ రెడ్డి సినిమాని విజయ్ దేవరకొండతో తీస్తున్నాడని తెలుకున్నానని.. అయితే విజయ్ ఎలా చేస్తాడో అనుకున్నా.. కానీ అర్జున్ రెడ్డి సినిమాకి విజయ్ దేవరకుండానే కరెక్ట ని సినిమా రిలీజ్ అయ్యాక అర్దం అయిందని తెలిపాడు. అర్జున్ రెడ్డిలా విజయ్ దేవరకొండ చేసిన నటన మరో హీరో చేయాలేడని శర్వానంద్ తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -