Thursday, May 2, 2024
- Advertisement -

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు సమన్లు, ఎందుకంటే..?

- Advertisement -

ఏపీ ప్రత్యేక హోద కోసం.. కరువు అంశాల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ప్రతిపక్షన్ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసినప్పుడు.. జగన్ పై అంటూ మే 15న‌.. అమ్మ జగనా.. అంటూ ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచారించింది. దాంతో జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు కథలనాలు ప్రచురించినందుకు గాను.. ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్‌ వెంకట శేషగిరిరావు, ఎడిటర్‌ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ నాంప‌ల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు.

దాంతో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏడుగురికి నాంపల్లి కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. అయితే నిజానికి పార్టీ ఫిరాయింపులు, అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల బాధలు, మిర్చి రైతుల దుస్థితి, ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతి తదితర అంశాలపై జగన్‌.. ప్రధాన మంత్రికి వినతిపత్రం సమర్పించాగా.. జగన్‌ తనపై నమోదైన కేసులకు సంబంధించి వినతిపత్రం సమర్పించినట్లు రాధాకృష్ణ ఆ కథనంలో రాయించారు. ఆ వినపత్రంలో గౌరవనీయులైన నరేంద్రమోదీజీ అని సంబోధిస్తే.. ఆంధ్రజ్యోతి మాత్రం ఎక్స్‌లెన్సీ (సర్వశ్రేష్ట) అని రాసినట్లు ఆ కథనంలో పేర్కొంది. ఈ కథనంపై వైసీపీ పత్రికా సమావేశం పెట్టి వాస్తవాలను వివరించి.. ప్రధానమంత్రికి ఇచ్చిన వినతి పత్రాన్ని చూపించింది.

అయితే ఈ విషయాలను తన పత్రికలో ప్రచురించని రాధాకృష్ణ.. ఆ కథనానికి కొనసాగింపుగా పాత లేఖ పేరిట వైసీపీ కొత్తపాట అంటూ మరో త‌ప్పుడు కథనం రాయించి జనలను తప్పుదోవ పట్టించారు. దీంతో ఆ తప్పుడు కథనం ప్రచురితం కావడంకు కారణమైన రాధాకృష్ణతో పాటు ఎడిట‌ర్ మ‌రికొంత‌మందికి స‌మ‌న్లు జారీ చేయాల‌ని ఆర్కే కోర్టును కోరారు. ఈ విషయంపై స్పందించిన కోర్టు తదుపరి చర్యల్లో భాగంగా తొలుత ఆళ్ల వాంగ్మూలం నమోదు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -