Thursday, May 16, 2024
- Advertisement -

పవన్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడంటే..?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఏ రెంజ్ లో ఫాలోయింగ్ ఉందో చూడాలి. అయితే రాజకీయంగా.. సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నారు. అయితే ఆయన పెళ్లిళ విషయంలోకి వెళ్తే.. అసలు పవన్ పెళ్లిళ్ల వెనక ఉన్న కథ.. కథనం ఏంటో ఇప్పుడు చూద్దాం.. మొదటి పెళ్లి.. ఇంట్లో వాళ్లు చూసిన అమ్మాయి నందినితో జరిగింది.

అయితే పెళ్లి అయ్యాక కొద్దీ రోజులు బాగానే ఉన్నా తర్వాత వాళ్ళ మధ్య మనస్పర్థలు రావడంతో.. ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది. చిరు ఫ్యామిలీ ఎంత కలపాలి అని చూసిన వాళ్లు కలవలేదు. చివరకు విడాకులు తీసుకొన్నారు. ఇక అదే టైంలో రేణు దేశాయ్ తో బద్రి సినిమా చేసిన పవన్ ఆ తర్వాత జూనీ సినిమా టైంలో ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా పవన్ ను ఇష్టపడటంతో.. ఆ ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. వాళ్ళకి అఖీరా, ఆధ్యా అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అంత బానే ఉంది మరి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అంటే పవన్ వ్యక్తిత్వమే కారణం. అంటే పవన్ అంత చెడ్డవాడా? లేదు చెడ్డవాడు కాదు మంచి వాడే అవసరానికంటే ఎక్కువ మంచివాడు ఎవరైనా ఏదైనా సహాయం కావలి అని అడిగితే ముందు వెనుక ఆలోచించకుండా సహాయం చేసేస్తాడు. అప్పట్లో ఆరెంజ్ మూవీ టైంలో భారీగా నష్టపోయిన నాగబాబుని ఆదోకోవడానికి ఉన్నా ఇల్లుని అమ్మేశాడు. ఈ ప్రవర్తన వాళ్ళ విసిగిపోయిన రేణు దేశాయ్ ఆయన్ని మారమని అడిగింది ఆయన అందుకు నిరాకరించడంతో చేసేదేమి లేక ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది.

అదే టైంలో తీన్ మార్ సినిమాలో నటించిన అన్నా లెజినోవా తో పరిచయం అయింది. ఇంగ్లీష్ సినిమాల్లో చేసిన ఆమె పవన్ లాగానే అందరికి సహాయం చేసే మనస్తత్వం కలిగిన మహిళ తాను కూడా ఇలా లేని పోని సహాయాలు అన్ని చేసి చాలానే ఆస్తులను పోగొట్టుకుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది ఇద్దరి మనోభావాలు కలవడంతో వారు ఇద్దరు పెళ్లి చేసుకొన్నారు. వారికి ఒక పాప కూడా ఉంది. సో పవన్ పెళ్లిల వెనక ఉన్న అసలు కథ ఇదే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -