Friday, May 17, 2024
- Advertisement -

సమంత ఆఫర్‌ని కొట్టేసిన శృతి!

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో ఇది కామనే. ఒక హీరోయిన్ ఛాన్స్‌ని మరో హీరోయిన్ దక్కించుకోవడం. ఇక కొన్ని సినిమాలైతే చాలా సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత కూడా హీరోయిన్‌ని మార్చి రీ షూట్ చేస్తారు. తాజాగా అలాంటిదే మరోసారి జరిగింది. నటి సమంతకు వచ్చిన ఛాన్స్‌ను కొట్టేసింది శృతి హాసన్.

ఫిలిప్ జాన్ దర్శకత్వంలో శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో చెన్నై స్టోరీ అనే అంతర్జాతీయ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వాస్తవానికి తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను అనుకున్నారు. అయితే అనుకోని కారణాలతో సమంత స్థానంలో శృతిని తీసుకున్నారు. మురారి రచించిన ఫేమస్ నవల…ది అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది.

వాస్తవానికి జాన్‌ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయగా దీనికి ‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా పట్టాలెక్కలేదు. దీనిని పక్కన పెట్టి శృతి హాసన్‌తో మరో ప్రాజెక్టు ప్రకటించారు మేకర్స్‌. నిజానికి ఫిలిప్‌ జాన్‌ తో వర్క్ చేయడానికి సమంత చాలా ఇంట్రెస్ట్ చూపించింది. కానీ అనారోగ్యంతో దూరం కావడంతో శృతి హాసన్ ఈ లక్‌ కొట్టేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -