Saturday, April 27, 2024
- Advertisement -

జై హనుమాన్‌లో స్టార్ నటుడు!

- Advertisement -

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.200 కోట్ల వసూళ్లను దాటేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా జై హనుమాన్ వస్తున్న సంగతి తెలిసిందే.

ఇక హనుమాన్‌ చిత్రం చివరి సన్నివేశాల్లో హనుమంతుడి పాత్ర పోషించేది ఎవరనేది చూపించకున్న ప్రేక్షకుల్లో మాత్రం క్యూరియాసిటీ పెంచేశారు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే జై హనుమాన్ స్క్రిప్ట్ కూడా రెడీ కాగా హనుమాన్‌కు వంద రేట్లు జై హనుమాన్ ఉంటుందని వెల్లడించారు ప్రశాంత్ వర్మ.

జై హనుమాన్‌ లో ఓ స్టార్ హీరో ఆంజనేయ స్వామి పాత్రలో కనిపిస్తారని చెప్పగా 2025లో ఈ మూవీ రిలీజ్ కానుంది. దీంతో హనుమాన్ పాత్రలో కనిపించే హీరో ఎవరా అనే వెతికే పనిలో పడ్డారు అంతా. అయితే తాజాగా టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం హనుమంతుడి పాత్రలో రానా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జై హనుమాన్‌ సినిమాలో శ్రీరాముడిగా రామ్‌ చరణ్‌ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -