- Advertisement -

సిద్దూతో ప్రేమలో బేబి బ్యూటీ!

- Advertisement -

సిద్దూ జొన్నలగడ్డ…టాలీవుడ్ క్రేజీ హీరో. డీజే టిల్లు సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్ హీరో అయిపోయారు. తెలంగాణ యాస, తన పాత్రలో ఒదిగిపోయారు సిద్దూ. ఈ సినిమాలో సిద్దూ నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రాబోతుంది. దీంతో పాటు పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సిద్దూ.

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌తో సినిమాకు ఓకే చెప్పారు డీజే టిల్లు సిద్దూ. ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్‌ బొమ్మరిల్లు భాస్కర్. అఖిల్‌తో చివరగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌ సినిమా చేశారు భాస్కర్. తాజాగా సిద్దూతో ఓ రొమాంటిక్ లవ్‌ స్టోరీని ప్లాన్ చేస్తున్నారట. సినిమా చేస్తుండగా ఈ మూవీలో బేబీ బ్యూటీ వైష్ణవీ హీరోయిన్‌గా నటించనుందట.

బేబి సినిమాతో కుర్రకారు గుండెను పిండేసింది వైష్ణవి. తొలి సినిమానే నెగటివ్ క్యారెక్టర్ చేసి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వైష్ణవికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో భాస్కర్ తాను సిద్ధం చేసిన కథకు వైష్ణవి అయితేనే బాగా సెట్ అవుతుందని భావించారట. అంతేగాదు సిద్దూ – వైష్ణవి ఇద్దరూ కలిస్తే వెండితెరపై తెలంగాణ యాస సహజంగా ఉట్టిపడటమే కాదు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయం అని భావిస్తున్నారట. అందుకే వైష్ణవి వైపే మొగ్గుచూపుతున్నారట. కథకు తగ్గట్టు సిద్దూ – వైష్ణవి రొమాన్స్‌ అద్భుతంగా ఉంటుందట. ఈ సినిమాపై త్వరలో అఫిషయల్ అనౌన్స్‌మెంట్ రానుండగా ఒకవేళ నిజమైతే ఫ్యాన్స్‌కు కన్నుల పండగే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -