Monday, April 29, 2024
- Advertisement -

పూరి’రొమాంటిక్’ సినిమాలో సిమ్రాన్..!

- Advertisement -

సిమ్రాన్ కు తెలుగు, తమిళ సినిమాల్లో మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోలందరి సరసన నటించి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చాలాకాలంగా సినిమాలకు సిమ్రాన్ దూరంగా ఉంటుంది. ఇప్పుడు మళ్లీ నటించాలని అనుకుంటుందట. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న ‘రొమాంటిక్’ సినిమాలో సిమ్రాన్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తోందని తెలుస్తోంది.

పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆకాష్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పూరి శిష్యుడు అనిల్ పాదూరిని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోందని తెలిసింది. అయితే ఆమెతో పాటు మరో సీనియర్ నటి సిమ్రాన్ కూడా నటిస్తోందని, అది కూడా పవర్ ఫుల్ అత్త పాత్రలో అని తెలుస్తుండటం ఆసక్తి రేపుతోంది. సిమ్రాన్ రోల్‌తో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని పూరి ఈ విషయాన్ని బయటకు దాచి పెట్టారట.

మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాకు సిమ్రాన్ క్యారెక్టర్ చాలా ప్లస్ అవుతుందని అంటున్నారు. ఆకాష్ పూరి అత్తగా ఆమె అదరగొట్టేయనుందట. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా ఈ మూవీ నిర్మిస్తున్నారు. కొడుకుని హీరోగా సక్సెస్ చేయాలని పూరి అన్ని విధాలుగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో రొమాంటిక్ డోస్ బాగా దట్టించారని, కథాకథనాలతో పాటు రొమాంటిక్ సీక్వెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయట.

బావమరిది సినిమా కోసం ఎన్టీఆర్ అదిరే ప్లాన్..!

బిగ్ బాస్ 4లో పాల్గొనే పది మంది కంటెస్టెంట్స్ వీరే..!

ఆదిపురుష్.. ఇలాంటి సినిమా ప్రభాస్ కెరీర్ లో రాదట..!

బిగ్ బాస్ లోకి ఆంటీ, యాంకర్.. ఇక రచ్చ రచ్చే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -