Sunday, May 19, 2024
- Advertisement -

సింగర్‌ కౌసల్యకు వేధింపులు.. ఏం జరిగింది ?

- Advertisement -

సెలబ్రిటీ హోదాలో ఉన్నవారికి కొన్నిసార్లు విమర్శలు తప్పవు. అయితే మహిళ సెలబ్రిటీలకు వేధింపులు కొత్తేం కాదు. కొన్ని విషయాలను లైట్ తీసుకునే సెలబ్రిటీలు.. అసభ్య పదజాలంతో.. రోజూ వేధిస్తుంటే.. పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కక తప్పదు. ఇప్పుడు ఇలాంటి సమస్యే సింగర్ కౌసల్యకు ఎదురైంది.

సెలెబ్రిటీలు ఎన్ని ఫోన్స్ నెంబర్స్ మార్చినా.. ఇప్పుడున్న కాలంతో, టెక్నాలజీతో ఈజీగా తెలిసిపోతూంటాయి. కొంతమందికి వారి నెంబర్ దొరికితే సంబరపడుతూంటారు. మరికొందరు మాత్రం.. ఇదే ఛాన్స్ కదా అని వేధిస్తూంటారు. సింగర్ కౌసల్య అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలియని వారుండరు. కౌసల్య పాడిన ఎన్నో పాటలు చాలా ఫాపులర్ అయ్యాయి కూడా. ఇప్పటికి ఆమె పాటలకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆమెకు వాట్సాప్‌ ఓపెన్ చేయాలంటేనే విసుగు వస్తుందట.

కారణమేంటంటే.. ఆమెకు అసభ్య పదజాలంతో కూడిన మెసేజ్‌లు పంపి ఆకతాయిలు వేధిస్తున్నారు. ఒకటి బ్లాక్ చేస్తుంటే మరొకటి.. ఇలా విసిగిపోయిన కౌసల్య 10 కాదు.. 20 కాదు.. ఏకంగా 342 కాంటాక్ట్స్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఇంకా మెసేజ్‌లు ఆగకపోవడంతో.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కౌసల్యకు సింగర్ గా ఛాన్సులు తగ్గాయి. అందుకే నటనలోకి అడుగులు వేస్తోంది. ఓ వెబ్ సీరిస్ లో ఈమె నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -