Tuesday, April 16, 2024
- Advertisement -

బాలీవుడ్ లోకి ‘క్రాక్’ రిమేక్.. హీరో ఎవరో తెలుసా?

- Advertisement -

ఈ మద్య తెలుగు లో సూపర్ హిట్ అయిన చిత్రాలు హిందీలో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో చిత్రపరిశ్రమలు అన్నీ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే అవి పునఃప్రారంభం అయ్యాయి. షాపింగ్ మాల్స్, థియేటర్లు ఓపెను చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయిన నేపథ్యంలో మాస్ మహరాజ రవితేజ నటించిన ‘క్రాక్’ చిత్రం రిలీజ్ కావడం.. మంచి హిట్ టాక్ తెచ్చుకోవడం జరిగింది.

ఈ క్రమంలో తాజాగా విడుదలైన ‘క్రాక్’ సినిమా కూడా అప్పుడే హిందీలోకి రీమేక్ చేయనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన ‘క్రాక్’ బాలీవుడ్ రిమేక్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.  ‘క్రాక్’ హిట్టవ్వడంతో ఈ చిత్రాన్ని తానే రీమేక్ చేయాలని బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆయన డైరెక్టుగా చిత్ర నిర్మాత మధుతో చర్చలు కూడా జరుపుతున్నట్టు చెబుతున్నారు. అంతే కాదు తానే స్వయంగా నిర్మించి హీరోగా నటించాలని సోనూ సూద్ భావిస్తున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. మరి, ఇందులో ఎంతవరకు వాస్తవం వుందన్నది త్వరలో తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -