Friday, April 26, 2024
- Advertisement -

విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలని నెటిజన్స్ డిమాండ్?

- Advertisement -

ఈ మద్య సెలబ్రెటీలు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలని కొంత మంది డిమాండ్ చేయడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.  తన పుట్టిన రోజు సందర్భంగా విజయ్ మూడు రోజుల ముందే తన తూన సినిమా సెట్స్‌లో కేక్ కట్ చేశాడు. కాకపోతే అది ఆ కేక్‌ను చిన్న కత్తితో కట్ చేస్తే పర్వాలేదు.

కానీ విజయ్ పెద్ద తల్వార్‌తో కేక్‌ కటింగ్ చేశాడు. ఇదివరకు ఇదే తరహాలో కొందరు తల్వార్‌తో కేక్ కటింగ్ చేశాడని చెన్నై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఓ సెలబ్రెటీ ఇలా చేయడంతో అతనిపై అంతటా వ్యతిరేకత వచ్చింది. దీనిపై స్పందించిన విజయ్ అందిని క్షమాపణ కోరాడు. ఈ అంశంపై విజయ్ ట్వీట్ కూడా చేశాడు.

‘నా పుట్టిన రోజు సందర్భంగా నన్ను విష్ చేసిన సినీ ప్రముఖులు, అభిమానులకు నా ధన్యవాదాలు. మూడు రోజుల క్రితం నేను కేక్ కట్ చేసిన ఫోటో వైరల్ కావడంపై చింతిస్తున్నా అన్నారు. మరోసారి ఇలా జరకుండా జాగ్రత్త పడతాను. తెలిసీ తెలీకుండా ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే నన్ను క్షమించండ’ని విజయ్ తమిళంలో ట్వీట్ చేశాడు. మరి దీనిపై నెటిజన్లు ఏమని స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -