Friday, May 3, 2024
- Advertisement -

బాలయ్యతో అనిల్ మరో ప్రయోగం!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. తండ్రి – కూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తాచాటింది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య నటనకు ఫిదా కాని వారుండరూ. తన ఏజ్‌కి తగ్గ పాత్ర చేసి ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు బాలయ్య. ఈ సినిమాలో బాలయ్య తండ్రిగా శ్రీలీల కూతురుగా నటించగా తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ భగవంత్ కేసరి 2 రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలోనూ బాలయ్య – శ్రీలీల చుట్టూ కథ తిరగనుందట. అయితే ఈ సారి తండ్రి – కూతుళ్లుగా కాదు గురు -శిష్యులుగా. ఈ సినిమాకు గురువు అనే టైటిల్‌ని పరిశీలిస్తుండగా కథ కోసం అనిల్ అప్పుడే కసరత్తు ప్రారంభించాడు కూడా.

మధ్యలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత నుంచి సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. భగవంత్ కేసరిలో తన మార్క్ కామెడీని పక్కకు పెట్టిన అనిల్…ఈసారి మాత్రం ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడట. భగవంత్ కేసరి సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -