Thursday, May 8, 2025
- Advertisement -

శ్రీలీల లిప్ లాక్..అప్పుడు అలా..ఇప్పుడు ఇలా!

- Advertisement -

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్ శ్రీలీల. ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుండటంతో అగ్ర హీరోల దగ్గరి నుండి చిన్న హీరోల వరకు అంతా శ్రీలీలనే కోరుకుంటున్నారు. రీసెంట్‌గా భగవంత్ కేసరితో హిట్ కొట్టింది. ఈ సినిమా తర్వాత పంజా వైష్ణవ్ తేజ్‌తో శ్రీలీల నటించిన ఆది కేశవ విడుదలకు సిద్ధంగా ఉండగా దీంతో పాటు మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం , పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ , విజయ్ దేవరకొండ, నితిన్ తో సినిమాలు చేస్తోంది.

ఇక భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల సందర్భంగా లిప్ లాక్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన లిప్ లాక్ కాబోయే భర్తతోనే అని చెప్పుకొచ్చింది. అయితే శ్రీలీల 2019లో నటించిన కన్నడ సినిమాలో హీరోకు లిప్ లాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతే నెటిజన్లు శ్రీలీలను ఆటాడుకుంటున్నారు.

బహుశా ఆమె భర్త ఇతడెనేమో అంటూ కామెంట్లుతో రచ్చ చేస్తున్నారు. మరి దీనిపై శ్రీలీల ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -