Tuesday, May 21, 2024
- Advertisement -

శ్రీలీల ఎంత పనిచేసిందో తెలుసా?

- Advertisement -

శ్రీలీల ఇప్పుడు దక్షిణాదిన ఫేవరేట్ హీరోయిన్‌గా మారిపోయారు.చేసింది కొన్ని సినిమాలే అయినా అగ్ర హీరోలతో నటించే అవకాశాన్ని కొట్టేశారు. రీసెంట్‌గా గుంటూరు కారంలో మహేష్‌ బాబుతో నటించి మెప్పించారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడగా స్వయంగా మహేష్ బాబు సైతం ప్రశంసలు గుప్పించారు.

గుంటూరు కారం త‌ర్వాత ఈ అమ్మ‌డుకి పెద్ద‌గా ఆఫ‌ర్లు రాలేదు. ఇలాంటి సంద‌ర్భంలో కోలీవుడ్ స్టార్ హీరో సినిమాకు శ్రీ‌లీల నో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌‌‌‌ స్టార్ హీరోలో ఒకరైన విజయ్‌‌‌‌‌‌‌‌ సినిమాలో శ్రీ‌లీలకు అవ‌కాశం వ‌చ్చింది. అయితే, ఈ అమ్మ‌డు మాత్రం ఆ సినిమాకు నో చెప్పేసింది.

విజయ్ హీరోగా వ‌స్తున్న చిత్రం గోట్‌. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వ‌హిస్తున్నారు. విజ‌య్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తుండ‌డంతో ఇదే చివ‌రి సినిమా అని కోలీవుడ్ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమాలో స్పెషల్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ కోసం మూవీ మేక‌ర్స్ శ్రీలీలను సంప్రదించిన‌ట్లు తెలుస్తోంది. శ్రీ‌లీల ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నో చెప్పిన‌ట్లు స‌మాచారం. కోలీవుడ్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో ఎంట్రీ ఇవ్వ‌డం కంటే హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వ్వ‌డం మంచిద‌ని ఆమె భావిస్తోన్న‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -