Friday, March 29, 2024
- Advertisement -

శ్రీముఖిని ఏడ్పించిన బిగ్ బాస్.. రాహుల్ కు వార్నింగ్..!

- Advertisement -

కంటెస్టంట్స్ బంధువులను హౌస్ లోకి పంపి వారిని చాలా ఎమోషనల్ అయ్యేలా చేశాడు బిగ్ బాస్. వితికా, అలీ, శివజ్యోతి, బాబా భాస్కర్ రిలేటివ్స్ ఇంటిలోకి వచ్చారు. ఇక గురువారం రోజు వరుణ్ బామ్మ, రాహుల్ అమ్మ, శ్రీముఖి అమ్మ ఇంటిలోకి వచ్చారు. వరుణ్ బామ్మ హౌస్ లో చాలా సరదగా గడిపారు. ఆ తర్వార రాహుల్ పరిగెత్తుకుంటూ తన తల్లి వడిలో ఒదిగిపోయాడు. ఇక చివరికి బిగ్ బాస్ శ్రీముఖి ఎమోషన్ తో ఓ గేమ్ ఆడుకున్నాడు. ఆమెని పవర్ సేవ్ మోడ్ లో ఉంచాడు.

ఆ టైంలోనే శ్రీముఖి తల్లిని ఇంటిలోకి పంపించాడు. తర్వాత అదే గేటు నుంచి బయటకు వెళ్లాలని సూచించాడు. దాంతో శ్రీముఖి బోరున ఏడ్చింది. కంట్రోల్ కూడా చేసుకోకుండా నాన్ స్టాప్ గా ఏడ్చేసింది. అయితే తర్వాత బిగ్ బాస్ సర్ ఫ్రజ్ ఇస్తూ.. శ్రీముఖి తల్లిని ఇంకో డోర్ నుంచి ఇంటిలోకి పంపించాడు. దాంతో శ్రీముఖి తెగ సంతోషపడింది. ఇక ఆమె తల్లి శ్రీముఖి గేమ్ గురించి చెప్పారు. నువ్వు ఆల్ రెడీ టైటిల్ గెల్చుకున్నావు.

బయట నీకు మంచి క్రేజ్ ఉంది అంటూ పొగిడింది. బాబా భాస్కర్-శ్రీముఖి కాంబినేషన్ బయట ప్రేక్షకులకు నచ్చుతుందని.. కానీ రాహుల్ నిన్ను అలా అనడం తట్టుకోలేకపోయానని శ్రీముఖి తల్లి బాధతో చెప్పింది. తర్వాత ఆమె ఇంటి సభ్యులతో మాట్లాడుతూ.. రాహుల్ పై ఫైర్ అయింది.

బిగ్ బాస్ ఇంటిలోకి నువ్వు వెళ్తున్నావు అంటే శ్రీముఖికి తోడుగా ఉంటావు అనుకున్నా.. కానీ నువ్వు ఆమెని అంటున్న మాటలకు ఓ తల్లిగా నాకు చాలా బాధగా ఉందని రాహుల్ కు గట్టిగానే ఇచ్చింది. ఇక ఇంటి సభ్యులందరితో మాట్లాడిన ఆమె చివరిగా హోటల్ టాస్క్ లో బాబా ఇచ్చిన టీ నచ్చడంతో బిగ్ బాస్ హోటల్ కు స్టర్ ఇచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ 7స్టార్ హోటల్ గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -