ఆసుప‌త్రిలో అమితాబ్‌.. ఏమైంది ?

- Advertisement -

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కాలేయ సంబధ సమస్యతో ముంబైలోని నానవతి ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అమితాబ్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఐసీయూ తరహాలోని రూంలో ఆయనను ఉంచారని.. కుటుంబ సభ్యులు తరచూ ఆసుపత్రికి వస్తున్నారని తెలుస్తోంది.

అయితే అమితాబ్ రెగ్యులర్ గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తం అడ్మిట్ అయ్యారని.. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలిపింది. కొద్ది రోజులపాటి విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అమితాబ్ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -