Thursday, March 28, 2024
- Advertisement -

రానా బావా.. అభితో నా పెళ్లి ఎప్పుడు : శ్రీరెడ్డి

- Advertisement -

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని శ్రీరెడ్డి గతంలో పెద్ద దుమారమే లేపిన విషయం అందరికి తెలిసిందే. ఛాన్స్ ల పేరుతో అమ్మాయిలను వాడుకుంటున్నారని మీటూ ఉద్యమంలో శ్రీ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించింది. అయితే మధ్యలో దగ్గుబాటి ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్‌పై దారుణమైన కామెంట్స్ చేసింది. చివరకు చెన్నైకి వెళ్లి అక్కడ సెటైలింది.

అయితే మధ్య మధ్యలో అభిరామ్, రానా, నాని, పవన్ కళ్యాణ్ వంటి వారిపై కామెంట్స్ చేస్తూనే ఉంది. ఇటీవలే దగ్గుబాటి అభిరాం కారుకు ప్రమాదం జరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై శ్రీరెడ్డి స్పందించి తగిన శాస్తి అభిరాంకు జరిగిందని ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇక తాజాగా రానా పెళ్లిపై కామెంట్ చేస్తూ మరో వీడియోను వదిలింది. “మా రానా బావ పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిగింది. చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. మెహీకా డ్రెస్‌ బాగుంది. ఆల్ ది బెస్ట్ మిహీకా. రానా బావా కంగ్రాట్యులేషన్స్. నేను మీ ఫ్యామిలీతో రిలేషన్ ఫీల్ అవుతుంటా.. ఎన్నో కారణాలున్నాయ్ దానికి. అలాగే బాహుబలిలో మీరు చేసిన యాక్టింగ్‌కు ఫిదా అయిపోయాను.

ఆ క్యారెక్టర్ మీరు తప్ప ఎవరూ చేసినా కూడా నాకు తెలిసి బాహబలికి న్యాయం జరగదు. మిమ్మల్ని నేను అంతగా ఆరాధిస్తాను. అలాగే మీకు ఆనారోగ్యంగా ఉందని తెలిసినప్పుడు కూడా చాలా బాధపడ్డా. ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని అభిమానించి ఉండొచ్చు లేదంటే మీ బ్రదర్‌తో నాకు ఉన్న రిలేషన్ కావచ్చు. రకరకాల కారణాలున్నాయి. బావా మీరు మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మరి మా పెళ్లి ఎప్పుడు చేస్తారు.. అభితో.. చుమ్మా అడుగుతున్నా.. సరదాగా అడుగుతున్నా. బావల్ని మరదలు ఆటపట్టిస్తారు కదా.. అందుకే అడుగుతున్నా” అంటూ శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది.

నిజం సినిమాలో నన్ను మోసం చేసి ఆ సీన్స్ తీశారు : రాశీ

బిగ్‌బాస్‌లోకి ఎందుకు వెళ్తారో చెప్పిన ప్రగతి ఆంటీ..!

భర్త వేదించాడు.. తండ్రి మోసం చేశాడు : స్వాతి నాయుడు

మోహన్ బాబు ఇంటికి వెళ్లి మరి బెదిరించిన దుండగులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -