Friday, March 29, 2024
- Advertisement -

గూట్లే.. హౌలే అంటూ సుధీర్ పరువు తీసిన రాహుల్..(వీడియో)

- Advertisement -

వినాయక చవితి సందర్భంగా బుల్లితెరపై చాలా షోస్ ప్లాన్ చేశారు. ఆ రోజు స్పెషల్ ఈవెంట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలని ఫిక్స్ అయ్యారు. జబర్దస్త్ టీంతో ఈటీవీ వారు.. 2020 అనుకున్నది ఒకటి అయినది ఒకటి ప్రోగ్రాం, ఇటు అదిరింది టీంతో జీ తెలుగు వారు బాపు బొమ్మకు పెళ్లంట అనే ఈవెంట్‌తో రెడీ అయ్యారు. ప్రోమోలతో హైప్ పెంచేసుకుంటున్నారు. అనుకున్నది ఒకటి అయినది ఒకటి ప్రోగ్రాంకు సంబంధించి తాజాగా రెండో ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో పునర్నవి అన్నగా సుధీర్, అక్కగా శ్రీముఖి కనిపించారు.

అంతేకాకుండా స్పెషక్ గెస్ట్ గా సునీల్ కూడా విచ్చేశాడు. ఎప్పటిలానే రోజా తనకు అలావాటైన పద్దతిలో ఎంట్రీ ఇచ్చిన సునీల్‌పై సెటైర్స్ వేసింది. ఇక స్కిట్‌లో భాగంగా సుధీర్‌ను నానా మాటలు అనేశాడు రాహుల్ సిప్లిగంజ్. దీంతో సుధీర్ పరువు పోయింది. పునర్నవి అన్నగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. ఓ అమ్మాయిని లేపుకురావడానికి సిగ్గులేదా. ఏం చేస్తుంటాడు అంటూ రాహుల్‌ను ప్రశ్నించగా.. మ్యూజిక్ అంటూ హైపర్ ఆది కౌంటర్ వేస్తాడు. ఇక వెంటనే రాహుల్ అందుకుని ఈ హౌలేగాడు ఏం చేస్తాడు అని సెటైర్ వేస్తాడు.

హైపర్ ఆది సమాధానం చెబుతూ మ్యాజిక్ చేస్తాడని కౌంటర్ వేస్తాడు. దీంతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వుతుంటారు. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లాంటి స్కిట్ అందర్ని నవ్వించింది. నైస్ కండ్స్ ఎక్కడ చేయించావ్.. బ్రో.. అంటూ రాహుల్‌ను సుధీర్ అడగ్గా.. చేయిస్తే రావురా గూట్లే చేస్తే వస్తాయ్.. అంటూ సుధీర్‌ను ఆడుకున్నాడు. ఇలా మొత్తానికి సుధీర్‌ను కాస్త అవమానించినట్టు సెటైర్లు వేసినా.. నవ్వులు మాత్రం పూయించారు. మీరు కూడా ఆ ప్రోమోని ఒకసారి చూడండి.

సిగ్గులేని జన్మ అంటూ.. సుధీర్ ని తిట్టిన రోజా..!

రామ్ చరణ్ వాడే వాచ్ ధర ఎంతో తెలుసా ?

ఘనంగా జరిగిన నిహారిక నిశ్చితార్థం.. అల్లుడిపై నాగబాబు కామెంట్..!

పవన్ బర్త్ డే రోజున సర్ ఫ్రైజ్ ఇదే.. ఫ్యాన్స్ కి పండగ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -