డైరెక్టర్ రాజమౌళి వేరు.. మిగత డైరెక్టర్లు వేరు. రాజమౌళి ఓటమి ఎరుగని డైరెక్టర్. ఆయన తీసిన ప్రతీ సినిమా బాక్సఫీస్ వద్ద భారీ విజయాలను సాధించినవే. బాహుబలి సినిమా తర్వాత ఆయన స్థాయి అమాంతం ఎక్కడికో ఎగభాకింది. ఆయన నుంచి ఒక సినిమా వస్తోందంటే.. హీరోతో సంబంధం లేకుండా భారీ హిట్ కాయమని చెప్పొచ్చు.
ఆయన సినిమా వస్తుందంటే పరిశ్రమ అంతా ఒక్కసారిగా ఆయన ప్రజెక్ట్ వైపు దృష్టి పెడుతోంది. ఆ ఫలన హీరో నక్కతోక తొక్కాడని అందరు అనుకుంటారు. కానీ ఇప్పడు చెప్పే హీరో కూడా ఓ పెద్ద స్టార్. ఆయనతో సినిమా చేసేందుకు డైరెక్టర్లు కూడా పోటీ పడుతుందటారు ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే.. ఎలా ఉంటుంది?
మాటల్లో చెప్పలేము కదా..? ఈ ఇద్దరి కాంబోలో నిజంగానే సినిమా రాబోతుందట. దీనిపై గత కొంత కాలంగా సన్నాహాలు జరుగుతున్నాయి. రాజమౌళి కూడా పబ్లిక్ గా దీనిపై మాట్లాడాడు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుందనేదే ఒక వార్త వినిపిస్తుంది. మహేశ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక కథను తయారుచేశారని సమాచారం. ఇది ఆఫ్రికన్ అడవుల్లో సాగే అడ్వెంచరస్ కథ తెలుస్తోంది. ఇది వచ్చే ఏడాది సెట్స్ కి వెళ్లే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
కొత్త సినిమాతో రాబోతున్న నాని! హిట్ కొట్టనున్నాడా ?
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ డైట్ పాలో అవ్వండి !
‘మహాసముద్రం’ పవర్‌ఫుల్ లుక్‌లో జగపతిబాబు
‘ఉప్పెన’ బ్యూటీతో యంగ్ టైగర్ రోమాన్స్ !