Friday, March 29, 2024
- Advertisement -

కొత్త సినిమాతో రాబోతున్న నాని! హిట్ కొట్ట‌నున్నాడా ?

- Advertisement -

నేచుర‌ల్ స్టార్ నాని శ్యామ్ సింగ‌రాయ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను టాక్సీవాలాతో హిట్ కొట్టిన యువదర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తీస్తున్నాడు. ట్యాక్సీవాలా త‌ర్వాత రాబోతున్న ఈ సినిమాను స్టార్ట్ చేసేందుకు ఈ ద‌ర్శ‌కుడికి రెండేళ్ల సమయం ప‌ట్టింది. చాలా రోజుల ముందే సినిమాకు సంబంధించి విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఎంతో మందిని ఆక‌ట్టుకుంది.

దీనికి సంబందించిన ప‌లు విష‌యాలు ఇప్ప‌టికే సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా లాక్ డౌన్ లేక‌పోతే.. పోయిన యేడు డిసెంబ‌ర్ లోనే విడుద‌ల కావాలి. అలాగే విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ కూడా ప్ర‌క‌టించింది. కానీ.. చిత్ర‌యూనిట్ రిలీజ్ విషయం పక్కన పెడితే షూటింగ్ కూడా స్టార్ట్ చేయ‌లేదు.

ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు సిద్ధ‌మైపోయింది. హై బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హీరో నానికి 27వది. ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో కాబోతుంది. పాతకాలం కలకత్తా నేపథ్యంలో ఈ సినిమాను తియ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగా కలకత్తాలో భారీ షెడ్యూల్ షూట్ చేయనున్నార‌ని స‌మ‌చారం. ఈ సినిమాలో నాని స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక ఎప్ప‌టికి పూర్తి అవుతుందో చూడాలి.

‘ప్రేమికుల రోజు’న ప్ర‌భాస్ స్పెష‌ల్ గిఫ్ట్..!

‘మ‌హాస‌ముద్రం’ ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో జ‌గ‌ప‌తిబాబు

డబ్బే మ‌న‌ది కుమ్మేస్కో అంటున్న కాజ‌ల్.. మంచు విష్ణు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -