Monday, April 29, 2024
- Advertisement -

సమంత అమెరికా వెళ్లడంలో ఆ హీరో జోక్యం.. తల్లికి చెప్పి మరీ అలా చేశాడా.. ఏం జరుగుతుంది..?

- Advertisement -

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇవ్వాలని చూస్తుంది. సమంత ఇలా చేయడం ఆమె ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేస్తున్నా సమంత తప్పక అలా చేయాల్సి వస్తుందని తెలుస్తుంది. రెండేళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఈమధ్యనే దాని నుంచి బయట పడినట్టు వెళ్లడించింది. అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ సమంత హడావిడిగా అమెరికా చెక్కేసింది. అయితే తెలుస్తున్న సమాచరం ప్రకారం సమంతకు మయోసైటిస్ వ్యాధి పూర్తిగా నయం కాలేదని అది మళ్లీ తిరగబట్టిందని అంటున్నారు.

అందుకే సమంత మరో ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుందట. అయితే సమంత అమెరికా పయనంలో ఒక హీరో ప్రమేయం ఉందని టాక్. స్టార్ హీరో ఒకరు సమంతని అమెరికా తీసుకెళ్లాడని ఆమె గురించి అతను స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని చెబ్తున్నారు. అంతేకాదు సమంత తల్లికి కూడా మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు సమంతని మళ్లీ పూర్తి ఆరోగ్యంతో తీసుకొచ్చే బాధ్యత తనదని చెప్పాడట.

అయితే అంతా బాగానే ఉంది కానీ సమంతకి ఆమె తల్లికి అలా మాటిచ్చిన బాలీవుడ్ హీరో ఎవరన్నది మాత్రం బయటకు రాలేదు. సమంత ప్రస్తుతం సిటాడెల్ సీరీస్ లో నటిస్తుంది. ఈ సీరీస్ మీద సమంత చాలా హోప్స్ పెట్టుకుంది. సమంత ఈమధ్య తెలుగు సినిమాలను బాగా తగ్గించేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సమంత ఖుషి సినిమా చేస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమె మరో తెలుగు సినిమా ఓకే చేయలేదు.

మొన్నటిదాకా నాగ చైతన్యతో డైవర్స్ ఇష్యూ మీద పోరాడిన సమంత అ తర్వాత తన హెల్త్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంది. దాదాపు పూర్తిగా తగ్గినని అనుకునే లోపే సమంత మళ్లీ సినిమాలకు గ్యాప్ ఇవ్వడం ఎన్నో అనుమానాలకు దారి తీస్తుంది. సమంత విషయంలో అసలేం జరుగుతుంది. ఆమె ఏం చేయాలని అనుకుంటుంది అన్నది త్వరలో తెలుస్తుంది.

నటిగా సౌత్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన సమంత సినిమా ఫలితాలు తేడా కొట్టినా సరే సమంత ఎప్పుడు నిరాశ పరచలేదు. ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ ఫిక్స్ చేశారు. సమంత నెక్స్ట్ తెలుగు సినిమా ఫై ఇంకా డీటైల్స్ రావాల్సి ఉంది. ఏం చేసినా ఎలా చేసినా ఆడియన్స్ ని మెప్పించడమే తన పని అనేలా సమంత ముందడుగు వేస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -