Sunday, April 28, 2024
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోలకు ఉన్న బ్యాడ్‌ క్వాలిటీస్‌ ఇవే

- Advertisement -

ప్రతి ఒక్కరికి ఏదో ఒక చెడు అలవాటు ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఎంత మంచివాడైనా.. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఏదో ఒక బలహీనత అనేది ఉంటుంది. ఆ బలహీనతలే కొందరికి చెడుగా కనిపిస్తాయి. సినిమా స్టార్స్‌ కూడా సాదారణ మనుషులే కనుక వారికి కూడా చెడు క్వాలిటీస్‌ ఉంటాయి. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా నెం.1 అంటూ అభిమానులు పిలుచుకునే హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కి కూడా బ్యాడ్‌ క్వాలిటీస్‌ ఉన్నాయని కొందరు అంటూ ఉంటారు.

ప్రధానంగా మూవీ షూటింగ్ టైంలో దర్శకు పనిలో వేలు పెడతాడట. ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాల విషయంలో ఇదే ఎక్కువగా వినిపించింది. సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో కూడా దర్శకుడి పనిలో పవన్ వేలు పేడుతున్నాడనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇక మహేష్‌బాబులోని బ్యాడ్‌ క్వాలిటీస్‌ను గురించి మాట్లాడలంటే గతంలో బాగా సిగరెట్లు తాగేవాడు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా సిగరెట్లను పూర్తిగా మానేశాడు. మహేష్ అనుకున్న వారికే సాయం చేస్తాడు, ప్రతి విషయాన్ని డబ్బుతో ముడి పెట్టి చూస్తాడు అనేది చాలా మంది వాదన. ఎక్కువ డబ్బు వస్తుందనే కారణంగా లెక్కకు మించి యాడ్స్‌ చేస్తుంటాడట. రామ్‌ చరణ్‌ విషయానికి వస్తే కోపం ఎక్కువగా అంటూ ఉంటారు.

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎక్కువ కోపం ఉండేదట. కానీ ఇప్పుడు ఆ కోపం అంతగా లేదు. ఏదైనా అభిమానుల సమావేశానికి హాజరు అవుతూ.. అభిమానులను హ్యాపీ చేస్తున్నాడు. బాలయ్య కోపం ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే వారిని కొట్టేస్తూ ఉంటాడు. జాతకాలను ఆయన ఎక్కువగా నమ్ముతారు. ఇక ఎన్టీఆర్‌లో మొహమాటం, అల్లు అర్జున్‌లో పొగరుబోతు తనం, ప్రభాస్‌లో సిగ్గు, వెంకటేష్‌లో ఆద్యాత్మిక చింతన, నాగార్జున బిజినెస్‌ మైండ్‌ అంటూ ఉంటారు. ఇంకా పలువురు హీరోలకు అమ్మాయిల వ్యామోహం, తాగుడు, డ్రగ్స్‌ వంటి బ్యాడ్‌ క్వాలిటీస్‌ ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -