- Advertisement -

లైంగిక వేధింపుల గురించి షాకింగ్ నిజాలు చెప్పిన తమన్నా

- Advertisement -

ఇటివలే కొంద‌రు మృగాళ్లు త‌న కెరీర్ ఆరంభంలో లైంగికంగా వేదించార‌ని .. త‌న జీవితంతో ఆటాడుకున్నార‌ని వ్యాఖ్యానించి బాలీవుడ్ క్వీన్ కంగ‌న సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కోవలోనే ప్రస్తుతం హూరోయిన్లపై లైంగిక వేదింపుల అంశంపై ఆస‌క్తిక‌ర డిబేట్ సాగుతోంది.

క్యాట్ విన్‌స్లెట్‌, యాంజెలీనా … నుంచి ఐశ్వ‌ర్యారాయ్ వ‌ర‌కూ లైంగిక వేదింపుల బాధితులే. కంగ‌న ర‌నౌత్‌, ప్రియాంక చోప్రా, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ … ఒక‌రేమిటి వేదింపులు ఎదుర్కోని వారున్నారా? .. ఇప్ప‌టి స్టార్ హీరోయిన్‌లు ఒక‌ప్ప‌టి అప్‌క‌మ్ నాయిక‌లే క‌దా.. వేదింపులు ఎదుర్కోకుండా ఉంటారా? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర డిబేట్ ప‌రిశ్ర‌మ‌లో న‌డుస్తోంది. కొంద‌రు అబ్బెబ్బే అలాంటిదేం లేద‌ని డిప్ల‌మాటిక్ ఆన్స‌ర్ ఇస్తున్నా.. మ‌రికొంద‌రు అసలు నిజం వేరే ఉందని అన్నారు. వేదింపుల వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట పెట్టేస్తున్నారు.

తాజాగా ఇలాంటి వేదింపులు మీక్కూడా ఎదుర‌య్యాయా? అన్న ప్రశ్న‌కు .. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా జవాబు దాట‌వేసింది. అలాంటివి త‌న‌కు ఎదురు కాలేద‌ని, ఆ విష‌యంలో అదృష్ట‌వంతురాలిన‌ని చెప్పింది. అయితే అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించే న‌వ‌త‌రం న‌టీమ‌ణుల‌కు ఆ ఇబ్బంది త‌ప్ప‌నిస‌రి. వేదింపులు ఎదుర్కోవాల్సిందేన‌ని కామెంట్ చేసింది. త‌మిళ‌నాడులో `స్కెచ్‌` మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న మిల్కీ పైవిధంగా కామెంట్ చేయ‌డం హాట్ టాపిక్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -