Saturday, May 18, 2024
- Advertisement -

డ్రగ్స్ తో స్టార్ ఫ్యామిలీకి సంబంధం : సుబ్బరాజు

- Advertisement -

డ్రగ్స్ రాకెట్ లో పూరి విచారణ తర్వాత కొంత చల్లబడింది అనుకునే లోపే.. ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారం.. నటుడు సుబ్బరాజు విచారణతో ముఖ్య మలుపు తిరిగింది. సుబ్బరాజును దాదాపు 10 గంటలపాటు విచారించారు. కేవలం 3 గంటల్లో సుబ్బరాజు విచారణ కంప్లీట్ అవుతుందనుకున్న మీడియా.. కానీ ఎవరు ఊహించని విధంగా సుబ్బరాజు విచారణ 10 గంటలపాటు జరగడంతో కలకలం రేపింది.

ప్రస్తుతం నోటిసులు అందుకున్న వారు మాత్రమే కాకుండా.. మరో 10 మంది నటులకు డ్రగ్స్ తో లింక్ ఉందనే.. విషయాలు లీక్ కావడంతో పరిశ్రమ మొత్తం షాక్ అవుతుంది. సినీ పరిశ్రమకు చెందిన ఓ సినీ స్టార్ ఫ్యామిలీకి డ్రగ్స్ తో లింక్ ఉందని సుబ్బరాజు విచారణలో చెప్పటంతో అధికారులు షాక్ అయ్యారు. ఇప్పుడు సిట్ అధికార్లు ఆ స్టార్ ఫ్యామిలీ కి కూడా నోటిసులు పంపించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ ఫ్యామిలీ ఇంట్లో ఇద్దరికి సంబందాలు ఉన్నాయనేది వెలుగులోకి రావడం ఒక్కసారి సినీ పరిశ్రమ షాక్ అయ్యింది. ఆ ఫ్యామిలీ మా వరకు రాదనుకున్న.. ఇప్పుడు తనదాకా రావడం.. అంటే విచారణ ఎంత సీరియస్ గా సాగుతుందో అనేది అర్ధం అవుతుంది.

ఆ స్టార్ ఫ్యామిలీనే కాకుండా.. ఓ ప్రముఖ కమెడియన్ దగ్గర కూడా డ్రగ్స్ వాసనలు ఉన్నాయనేది మరో విషయం. కెల్విన్ నుండి సుబ్బరాజుకు.. అక్కడి నుంచి ఆ కమెడియన్ కు వరసగా ఫోన్స్ రావడం ఆధారంగా ఈ విషయం బయటపడింది. కేవలం సరదాగానే దీన్ని తీసుకున్నామని బానిస కాలేదని స్పష్టం చేశాడు సుబ్బరాజు. అయితే స్టార్ ఫ్యామిలీ లోని ఇద్దరికి ఈ డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయనే విషయం.. మూడు రోజుల విచారణలో సెకరిస్తున్న వివరాల అధారంగా బయటపడ్డట్లు స్పష్టం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -