Wednesday, April 17, 2024
- Advertisement -

ఇలా జరిగితే.. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం

- Advertisement -

ఎన్నికల వాతావరణం.. ఏపీలో రెండు ఏళ్లకు ముందే.. కనిపిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా.. అధికార పార్టీ.. ప్రతిపక్ష పార్టి నాయకుల మధ్య మాటల యుద్దాలు జోరుగు నడుస్తున్నాయి. అందులోను నంద్యాల ఉపఎన్నికలు రావడంతో.. విజయం కోసం.. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ భారి స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. వైసీపీకి వ్యుహకర్తగా ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చినా… ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీలను ఒక పెద్ద సమస్య వచ్చిపడింది.

ఆ విషయం ఏంటంటే.. బీజేపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎవరితో జట్టుకడుతుంది అనేది సమస్య. ఇన్ని అధికార టీడీపీతో మిత్ర పక్షంగా కొనసాగిన బీజేపీ ఇప్పుడు జగన్ తో చేయికలిపే ఛాన్సులు వున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా వుంటే వెంకయ్యను రాజకీయాలనుండి తప్పించడం.. కూడా టీడీపీ కి ఏపీ లో చెక్ పెట్టే ఆలోచనేనని అర్ధం అవుతోంది. వెంకయ్య ఉన్నని రోజులు బీజేపీ, టీడీపీ లను ఒకే పార్టీ అనే విధంగా తాయారు చేశారు.. అంతే కాకుండా బీజేపీ టీడీపీ తో జట్టుకడితే.. బీజేపీ పార్టీకి తీవ్ర నష్టం జరిగేలా వుంది.

ఇక వైసీపీ సంగతికి వస్తే.. తర్వాత అధికారం లోకి రావాలని వైస్ జగన్ సీఎం చూడాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వైసీపీ ని చూసుకుంటే మంచి యువనాయకులు పార్టీలో వుండటం ఆ పార్టీకి కలిసోచే విషయం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ బీజేపీ రెండు కలిస్తే.. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇలా జరిగితే ముఖ్యమంత్రి కావడం ఖాయం వారి అభిప్రాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -