Friday, May 17, 2024
- Advertisement -

అబ్బ నీ తీయని దెబ్బ

- Advertisement -

ఈ పాట గుర్తుంది కదా. వార్తలు రాసుకునే ఓ రిపోర్టర్ ప్రస్తుతం ఇదే పాట పాడుకుంటున్నాడు. చేతి వేళ్లు ఆ విలేకరి చెంపకు అతుక్కుపోయేలా కొట్టింది అందాల తార సన్నీ లియోన్. ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా… సూరత్ లో. ఇంతకీ విషయం ఏమిటంటే హోలీ సందర్భంగా సూరత్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సన్నీ లియోన్ తన భర్తతో కలిసి వచ్చింది.

హొటల్ కారిడార్ లో ఓ జాతీయ ఛానెల్ రిపోర్టర్ ఎదురుపడ్డాడు. అమ్మడు దొరికింది కదా.. ఓ ఇంటర్వ్యూ లాగించేద్దామనుకుని సన్నీని ప్రశ్నలతో ముంచెత్తాడు. మధ్యలో ఓ చిలిపి ప్రశ్న వేశాడు. అదేమిటంటే.. ఓ రాత్రి ప్రోగ్రామ్ కి మీరు ఎంత తీసుకుంటారు అని అడిగాడు. ఏది మళ్లీ మరోసారి అడుగు అన్న సన్ని లియోన్ ఆ విలేకరి మళ్లీ ప్రశ్న పూర్తవకుండానే చెంప ఛెళ్లుమనిపించింది.

అయినా భర్త పక్కనే ఉండగా ఇలాంటి ప్రశ్నలు వేస్తే కోపం రాదు. ఈ విలేకరులున్నారేఏ.. వీళ్లకి ఓ పట్టాన అర్ధం కాదు. సరే జరిగిందెదో జరిగింది.. రిపోర్టర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయం అని ఆమె భర్త చెప్పారు. అంతే కాదు.. ఈ కార్యక్రమం విద్యార్ధులకు సంబంధించి కాబట్టి వాళ్ల భవిష్యతో దెబ్బతినకూడదని దీన్ని ఇక్కడితో వదిలేస్తున్నామని కూడా చెప్పారట. ఇది సరే… మరీ విద్యార్ధుల భవిష్యత్ పై ఎంతో ప్రేమ ఒలకపోస్తున్న లియోన్ దంపతులు సన్నీ వేసుకునే డ్రస్ లు చూసి యువత చెడిపోతుంది అని అనుకోరా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -